Banswada: నిజాంసాగర్ నీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ నిరసన
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రబీ సాగు కోసం నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు.
Banswada: నిజాంసాగర్ నీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ నిరసన
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గానికి, నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు, రబి పంట సాగుకు నీళ్లు వదలాలని నిరసన తెలిపారు బిఆర్ఎస్ నాయకులు.నిజాంసాగర్ లో 9.6 tmc ల నీళ్ళు నిలవ ఉన్నాయి.రైతులకు 4 తడులకు నీళ్లు వదులుతే రబి పంటలు పండుతాయని అన్నారు బిఆర్ఎస్ నాయకులు మోరల్ శ్రీనివాస్.ఎల్నినో ప్రభావం ఉంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.
నిజాంసాగర్ నీళ్లు వదిలి 9 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదు కోవాలని విజ్ఞప్తి చేశారు.ఇక్కడి భూములు కేవలం వారి పంట పండించడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు.కావున రైతులు వరికే మొగ్గు చూపుతున్నారని,ఇతర పంటలకు కోతుల బెడద,పక్షుల బెడద,పందుల బెడద ఎక్కువగా ఉంటుందని,కాబట్టి వారి పంట కు మొగ్గు చూపుతారని అన్నారు.
ఈ ఏటా వారికి గిట్టు బాటు ధర కూడా బాగా ఉండడం తో,పాటు పంట దిగుబడి కూడా ఎక్కువగా వచ్చిందని రైతులు సంతోషంగా ఉన్నా రాణి అన్నారు. అనంతరం ఆర్డిఒ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో నియజకవర్గం లోని అన్ని మండలాల నుండి రైతులు,నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




