Banswada: బాన్సువాడలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్!

Banswada: బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా కల్కిచెరువు ఘాట్ వద్ద సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 8 Oct 2026 10:29 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలను ఈ రోజు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఆడే ప్రదేశాలను,చెరువు వద్ద నిమజ్జనం చేసే చోట్లలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA