Banswada: బాన్సువాడలో నార్మల్ డెలివరీపై అవగాహన ర్యాలీ
Banswada: బాన్సువాడలో సిజేరియన్ కేసులు తగ్గించి నార్మల్ డెలివరీలపై అవగాహన ర్యాలీ; సొసైటీ ఆఫ్ మిడ్ వైఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ.
Banswada: బాన్సువాడలో నార్మల్ డెలివరీపై అవగాహన ర్యాలీ
బాన్సువాడ: సొసైటీ ఆఫ్ మిడ్ వైఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆఫర్ బర్తింగ్ కార్యక్రమాన్ని మాతా శిశు హాస్పిటల్ లో నర్సింగ్ కాలేజ్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయబాలరాజ్, మాతా శిశు హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రకాష్ రాథోడ్, కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ కలేక్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్ పాల్గొన్నారు.
కాలేజ్ ప్రిన్సిపాల్ అను ప్రణతి మాట్లాడుతూ సిజేరియన్ కేసులు పెరుగుతున్నాయని, నార్మల్ డెలివరీ అయ్యేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఆర్ఎంఓ ప్రకాష్ రాథోడ్ మరియు కౌన్సిలర్ కలేక్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, గౌస్ మాట్లాడుతూ నేచురల్ డెలివరీ పై అవగాహన కల్పించారు.ఆపరేషన్ చేసే బదులు సాధారణ ప్రసూతి చేస్తే,మహిళల ఆరోగ్యం బాగుంటుందని,దీర్ఘ కాలంలో వారికి నష్టం కలుగకుండా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని మాతా శిశు హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు, మాతా శిశు హాస్పిటల్ సిబ్బంది, కాలేజ్ విద్యార్థినులు, ప్రజలు పాల్గొన్నారు.




