Banswada: కల్కి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
Banswada: బాన్సువాడ కల్కి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. లైటింగ్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్.
Banswada: కల్కి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
బాన్సువాడ: బాన్సువాడ కల్కి చెరువు వద్ద నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి భక్తులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్, తాగునీరు, కుర్చీలు తదితర అవసరమైన ఏర్పాట్లను పురపాలక సంఘం వారు ముందస్తుగా చేసారు.
అలాగే నిమజ్జన కార్యక్రమం అనంతరం వినాయక మండపాల వద్ద పారిశుధ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, మండపాల నిర్వాహకులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నిమజ్జన అనంతరం ఏర్పడే పూజా సామగ్రి మరియు ఇతర వ్యర్థాలను రోడ్లపై లేదా చెరువు పరిసరాల్లో వేయకుండా పురపాలక సిబ్బందికి అప్పగించాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి వినాయక మండపం నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పురపాలక సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని అన్నారు. శోభాయాత్ర సమయంలో పారిశుధ్యాన్ని కాపాడుతూ, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పురపాలక సిబ్బంది సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, పరిశుభ్రంగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కమీషనర్ గోపు గంగాధర్ కోరారు.స్తానిక ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి తో కలిసి ఆయన చెరువు వద్ద స్థల పరిశీలన చేశారు.




