Balkonda: బాధితుడికి రూ.2.20 లక్షల ఎల్వోసీ అందజేసిన ప్రశాంత్ రెడ్డి

Balkonda: బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు చెందిన మాగాణి రాములు వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.2.20 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

VENU, BALKONDA
Published on: 28 Sept 2026 7:00 PM IST
Balkonda
X

Balkonda: బాధితుడికి రూ.2.20 లక్షల ఎల్వోసీ అందజేసిన ప్రశాంత్ రెడ్డి

Balkonda: బాల్కొండ నియోజకవర్గం, కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మాగాణి రాములు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన ₹2,20,000/- (రెండు లక్షల ఇరవై వేల రూపాయలు) ఎల్.ఓ.సి (Line of Credit) పత్రాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారునికి నేడు అందజేశారు.

మాగాణి రాములు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), హైదరాబాద్‌లో కిడ్నీ సంబంధిత వైద్య చికిత్స (Renal Transplant) పొందడం కోసం ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా బాధితుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో స్పందించి మొదటిసారి 2 లక్షల 50 వేల రూపాయలు ఈరోజు రూ. 2.20 లక్షల ఎల్.ఓ.సి మంజూరు చేయించి తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల బీ ఆర్ఎస్ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ ఉన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA