Armoor: సెయింట్ పాల్స్ హైస్కూల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు
Armoor: ఆర్మూర్ సెయింట్ పాల్స్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ.
Armoor: సెయింట్ పాల్స్ హైస్కూల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు
అర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు.
ట్రాఫిక్ ఏసీబీ మస్తాన్ అలీ మాట్లాడుతూ:
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తమ కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెంట్ పాల్ స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్, అయోర్ ఎడ్యుకేషన్ టీచర్స్, ట్రాఫిక్ ఏసిపి, ఎస్సై, కానిస్టేబుల్స్, స్కూల్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.




