Nizamabad: భక్తి మార్గం అలవర్చుకోవాలి.. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు!

Nizamabad: ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప సేవా సమితి మాస పూజ, అన్న వితరణ జరిగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

VAMSHI, ARMOOR
Published on: 15 Oct 2026 11:51 AM IST
Nizamabad
X

Nizamabad: భక్తి మార్గం అలవర్చుకోవాలి.. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు!

Nizamabad: భక్తి మార్గం అలవర్చుకోవాలని, నేటి యువత సన్మార్గంలో వెళ్లే విధంగా చూడాలని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. బుధవారం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మాస పూజ అన్న వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి యువత పెడదారిన పోకుండా భక్తి భావన తోపాటు సన్మార్గంలో వెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.

ప్రతినెలా రెండవ బుధవారం మాస పూజలు నిర్వహించి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని, అయ్యప్ప సేవా సమితి సభ్యులను ఆయన అభినందించారు. అంతకుముందు నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

మామిడిపల్లి ప్రభు దత్తు గురుస్వామి ఆధ్వర్యంలో మాల ధారణ స్వాములకు అన్న వితరణ కార్యక్రమంలో భోజనం అనంతరం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో తాంబూలాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవాసమితి అధ్యక్ష కార్యదర్శులు పుట్టి మురళి, మీసాల రవి, కోశాధికారి గాజారెడ్డి నర్సారెడ్డి, సహాయ కోశాధికారి షేర్ ఒడ్డెన్న, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, పెంట జలంధర్, గంగాధర్ గౌడ్, మీసాల రాజేశ్వర్, జన్నపల్లి రంజిత్, ద్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్, యోగేష్, కౌటిక విజయ్, నరేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, డిఈ భరత్, అయ్యప్ప స్వాములు, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR