Armoor: ఆర్మూర్‌లో నకిలీ కన్సల్టెన్సీ గుట్టు రట్టు వీసాల పేరుతో మోసం
Armoor: ఆర్మూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా 'షైన్ అబ్రాడ్' కన్సల్టెన్సీ పెట్టి విదేశీ వీసాల పేరుతో మోసం చేసిన షేక్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Armoor: ఆర్మూర్‌లో నకిలీ కన్సల్టెన్సీ గుట్టు రట్టు వీసాల పేరుతో మోసం
అర్మూర్: ఆర్మూరు పట్టణంలో మహాలక్ష్మి కాలనీ నందు, షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ (Shine Abroad Consultancy) పేరు మీద ఇతర దేశాలకు పాస్‌పోర్ట్‌లు, వీసాలు ఇప్పించి పంపుతామని, ఒక కన్సల్టెన్సీని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసి, తద్వారా ఎక్కువ మొత్తంలో ప్రజలను మోసం చేసినటువంటి షేక్ తాహ @ షేక్ సైఫ్, తండ్రి పేరు సలీం, వయసు 26 సంవత్సరాలు, వృత్తి కన్సల్టెన్సీ బిజినెస్, నివాసం ఆర్మూర్ అను వ్యక్తిని ఈరోజు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది...
ఈ విషయంపై సీ.ఐ. యొక్క వివరణ :
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణము మరియు నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడు, నందిపేట్, వేల్పూరు, జక్రాన్పల్లీ, నిజామాబాద్, ముగ్పాల్, మండలంలోని వివిధ గ్రామాలు, అంతేకాకుండా కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలలోని పలువురి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఇజ్రాయిల్, రష్యా మొదలగు దేశాలకు పంపిస్తానని, వర్క్ వీసాలు ఇప్పిస్తానని చెప్పి, ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు నుంచి పది లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి, సరియైన వీసాలు ఇవ్వకుండా, కొంతమందికి విసిట్ వీసాలు ఇచ్చి, మరికొందరికి అసలుకే ఎలాంటి వీసాలు ఇవ్వకుండా పాస్‌పోర్ట్ లు దగ్గర పెట్టుకొని, మోసం చేసి తిరుగుతున్న షేక్ సైఫ్ మీద ఫిర్యాదు రాగా, కేసు నమోదు చేశారు.
సైఫ్ అనే ఏజెంట్ వ్యక్తి దగ్గర నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారు:
సైఫ్ అనే వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఏజెంట్ గా చేస్తూ బాధితులను మోసం చేసిన విషయం ఇక తెలిసిందే, అతనిని ఈరోజు పట్టుకొని విచారణ చేసిన అనంతరం అతని వద్ద ఒక కారు మరియు సెల్‌ఫోన్ సీజ్ చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది.
ఇట్టి వ్యక్తి పైన మరియు ఇతని బాధితులు ఎవరైనా ఉన్నయెడల మీ మీ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గాని లేదా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందు గాని సంప్రదించిన ఎడల, చట్ట ప్రకారంగా మీకు తగిన సహాయాన్ని అందించడానికి వీలవుతుంది. కాబట్టి షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ బాధితులు ఎవరైనా ఉన్నయెడల తక్షణమే పోలీసు వారిని సంప్రదించాలని కోరడం జరుగుతుంది. తదుపరి ఇతడు ఎంత మంది వద్ద ఇలా డబ్బులు తీసుకుని మోసం చేసిన విషయము మరియు ఇతని యొక్క కంపెనీ వివరాలను విచారణలో తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది..
సైఫ్ అరే వ్యక్తి పై ఆరోపణలు:
కన్సల్టెన్సీ ఏర్పాటుచేసి వచ్చిన ప్రజలను అక్కడకు పంపిస్తా, ఇక్కడికి పంపిస్తా అంటూ పాస్‌పోర్ట్ లు తీసుకొని మోసం చేశారు బాధితులను, అతి చిన్న వయసులోనే ఈ సైఫ్ ఎవరి సపోర్ట్ తోనా లేదా తనకు తాను ఇలా చేశాడు, ప్రజల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నాయి, ఎందుకంటే గతంలో ఓ ఫౌండేషన్ నడుపుతున్న వ్యక్తితో అన్నా అన్నా అంటూ కొంతకాలంగా తిరుగుతూ, తన సొంతంగా ఏజెంట్‌గా కొనసాగించాడా, లేదా వేరే వ్యక్తులు ఎవరైనా గైడెన్స్ ఇచ్చారా అనే విషయం, కొన్ని రోజులు గడిస్తే గాని వివరాలు, ఇంకా మిగతా విషయాలు పోలీసు తో తెలియాల్సి ఉంది.




