Armoor: బస్సులు రాక వ్యాపారులు నష్టపోతున్నారు ఈరవత్రి రాజశేఖర్
Armoor: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవద్దని, పాత బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలని కమిషనర్‌కు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ వినతి.
Armoor: బస్సులు రాక వ్యాపారులు నష్టపోతున్నారు ఈరవత్రి రాజశేఖర్
అర్మూర్: మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవద్దని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు మెమోరాండం అందజేశారు.
అంబేద్కర్ విగ్రహానికి ఫౌండేషన్ చైర్మన్ పూలమాల:
ముందుగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం పాత బస్టాండ్ ప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ చిరు వ్యాపారులను, దుకాణాదారులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. దుకాణదారులు, చిరు వ్యాపారుల సమస్యలను ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవద్దంటూ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఫౌండేషన్ చైర్మన్ డిమాండ్లు:
1. మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవద్దు.
2. RTC బస్సులను పాత బస్టాండుకు పునరుద్ధరించాలి
3. ఆటో నరికే దారులకు ప్రయాణికులు లేక జీవనపాది దెబ్బతింటుంది.
E. R ఫౌండేషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ:
ఈ సందర్భంగా ఫౌండేషన్ ఈరవత్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా పాత బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవద్దని కోరారు. RTC బస్సులను పాత బస్టాండ్ కు తిరిగి నడపాలన్నారు. బస్సులు రాకపోవడంతో ఇక్కడే కొన్నేళ్లుగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారులకు కస్టమర్లు తగ్గుతున్నారని చెప్పారు. ఫలితంగా చిరు వ్యాపారులు, బంగారు ఆభరణాల తయారీదారులు, పూలు, పండ్లు, టీ స్టాల్ నిర్వాహకులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రయాణికులు లేక జీవనోపాధి దెబ్బతింటుందన్నారు.
పాత బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. RTC పరిధిలోని ప్రదేశాల్లో పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ మెరుగుపరచాలని. పాత బస్టాండ్ లోని రోడ్లపై గరుకైన రాళ్లు తొలగించి, గుంతలను పూడ్చి వేయించాలన్నారు. పాత బస్టాండ్ చుట్టూ మల్టీ లెవెల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని.. పంత్ రోడ్డు, చిన్న బజార్, పోచమ్మ గుడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని.. గోల్ బంగ్లా నుండి పెర్కిట్ బైపాస్ కు ప్రత్యామ్నాయ రహదారిని పరిశీలించాలని కోరారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి ప్రజలకు మద్దతుగా నిలుస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. చేనేతరంగాన్ని, చేనేత కార్మికులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. తాము చేపట్టిన పాదయాత్రను జయప్రదం చేసిన అందరికీ ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ వెంట ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ ప్రసాద్, నూకల శేఖర్, గడ్డం కృష్ణారెడ్డి, దోమల శ్రీనివాస్, ఈరవత్రి సురేందర్, జీవన్, ఇస్తాకుద్దిన్, టైలర్ వినోద్, కాకతీయ శ్రీను, నారా గౌడ్, ఓమ్ ట్రేడర్స్ గంగా మోహన్, రజనీష్ కిరాడ్, విటోబా శేఖర్, కర్తన్ నవీన్, అబ్దుల్ అలీమ్, బ్యాంకు నవీన్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.




