Armoor: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి దళిత సంఘాల నిరసన
Armoor: కౌన్సిలర్ పృథ్వీపై దాడి చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి జుబేర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన మాల మహానాడు.
Armoor: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి దళిత సంఘాల నిరసన
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయాన్ని మాల మహానాడు దళిత సంఘాలు అంతా కలిసి మున్సిపాలిని ముట్టడించారు. ఇలా ముట్టడించడంతో కార్యాలయం వద్ద వద్ద ఉద్రిక్తత నెలకొంది.
దళిత సంఘాలు ఎందుకు కార్యాలయాన్ని ముట్టనించారు:
గత నాలుగు రోజులు కిందట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ల సర్వసభ సమావేశం నిర్వహించారు, సభ ముగిసిన తర్వాత అక్కడ ఉన్న కార్మికురాలు ఆ వార్డుకు చెందిన టిఆర్ఎస్ కౌన్సిలర్ పృథ్వీ కి ఆమె బాధ చెప్పుకుంటూ నా దగ్గర జుబేర్ పైసలు వసూలు చేశారంటూ కౌన్సిలర్ కి చెప్పారు, పృథ్విపై ఔట్సోర్సింగ్ ఉద్యోగి జుబేర్ దాడి చేశాడనే ఆరోపణలతో దళిత సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు.
ఆర్మూర్ మున్సిపల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న జుబేర్, మున్సిపల్ కార్మికుల వద్ద లంచం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ పృథ్వి, జుబేర్ ను నిలదీశారు.దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం ముదరడంతో జుబేర్ కౌన్సిలర్ పృథ్విపై చేయి చేసుకోవడంతో దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడిని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ముట్టడించారు. జుబేర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. జుబేర్ ను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఒక ప్రజా ప్రతినిధిపైనే దాడి జరగడం పట్ల స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై మున్సిపల్ కౌన్సిలర్లు స్పందించి జుబేర్ పై చర్యలు తీసుకోనే విధంగా చూడాలని కోరారు. అధికారులు మూడు రోజులలో చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను ఐక్యo చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ:
మాల మహానాడు దళిత సంఘాలు అందరూ మున్సిపల్ కమిషనర్ కి అధికారి జుబేరుపై వినతిపత్రం అందజేయడం జరిగింది, కమిషనర్ దళిత సంఘాల వారికి దానిపై వెంటనే చర్య తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది, అలా హామీ ఇవ్వడంతో ఆ ముట్టడి సాఫీగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు దళిత సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




