Armoor: ఆర్మూర్‌లో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభం!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నేటి నుంచి జనవరి 4 వరకు కొనసాగే నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
Armoor: ఆర్మూర్‌లో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభం!
అర్మూర్ న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబీ హనుమాన్ ఆలయంలోని అయ్యప్ప దేవాలయంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ స్వాములకు నేటి నుండి జనవరి 4వ తేదీ వరకు నిత్యాన్నదానం ప్రారంభం అయినట్లు ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి తెలిపారు. అన్న వితరణ కార్యక్రమం మొదటి ప్రారంభానికి గోవింద్ పేట్ ఆనంద్ రెడ్డి అన్న వితరణ దాత గా స్వాములకు భోజనం ఏరాటు చేసినట్లు అయన చెప్పారు.
స్వాములకు అన్న వితరణ కోసం ఎవరైనా దాతలు ఉంటే సేవా సమితి సభ్యులను సంప్రదించాలని అయన కోరారు. మొదటి రోజు అన్న వితరణ కార్యక్రమాన్ని మెట్ల పూజ చేసి కన్నె స్వాములతో నగేష్ శర్మ గురు స్వామి ప్రారంభం చేయించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు సుమారు 130 మంది, భక్తులు 100 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి మీసాల రవి, కోశాధికారి గాజారెడ్డి నర్సా రెడ్డి, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, సేవా సమితి సలహా దారులు, సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.




