Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో రాక్ స్టార్ యూత్ గణపతికి అభిషేకాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో రాక్ స్టార్ యూత్ గణపతి వద్ద మహా అన్నదానం. ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 21 Sept 2026 8:47 AM IST
Nizamabad
X

Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో రాక్ స్టార్ యూత్ గణపతికి అభిషేకాలు!

Nizamabad: డిచ్ పల్లి మండల ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలోని రాక్ స్టార్ యూత్ గణపతి కి ప్రత్యేక అభిషేక పూజలు చేసిన భక్తులు విఘ్నేశ్వరుడి కృప ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రాక్ స్టార్ యూత్ సభ్యులు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాల సందర్భంగా దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని,అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అధిక సంఖ్యలోమహిళలు,చిన్నారులు, భక్తులు,గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ అన్నదాన కార్యక్రమంలో,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొని భక్తులకు, గ్రామస్థులకు అన్నప్రసాదాన్ని అందించారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD