Jukkal: జుక్కల్ సేవాలాల్ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!

Jukkal: జుక్కల్ సేవాలాల్ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు, తండాల జీపీ హోదాను గుర్తుచేసుకున్న నేతలు.

VEERANNA, JUKKAL
Published on: 17 Sept 2026 4:38 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ సేవాలాల్ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!

జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని సేవాలాల్ చౌక్ వద్ద గురువారం ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చిత్రపటానికి పాలాభిషేకంనిర్వహించారు.

అదే సమయంలో జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, పెద్దకొడప్‌గల్ మండలాల్లోని పలు గిరిజన తండాల్లో కూడా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బంజార సేవా సంఘ్ మండల అధ్యక్షుడు జాదవ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు జాదవ్ నాందేవ్ లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచే చర్యలు తీసుకోవడంతో పాటు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి స్వయం పాలనకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.

అలాగే పోడు భూముల పట్టాల పంపిణీ, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగానిర్వహించడం, హైదరాబాద్‌లో బంజార భవన్ నిర్మాణం వంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారుఅన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ జుక్కల్ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, పార్టీ నాయకుడు వష్రె రమేష్, ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ మండల ప్రధాన కార్యదర్శి చౌహన్ వినోద్ నాయక్, మాజీ సర్పంచ్‌లు గుల్ల రామారావు, సంజు నాయక్, పవర్ కిసాన్ తో పాటు బంజార సేవా సంఘ్ సభ్యులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL