Dichpally: డిచ్‌పల్లిలో ఎస్‌జీఎఫ్ క్రీడలు: రాంపూర్ విద్యార్థుల సత్తా
Dichpally: డిచ్‌పల్లి 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడల్లో జెడ్పీహెచ్ఎస్ రాంపూర్ విద్యార్థులు ఖో-ఖో, కబడ్డీల్లో 7 షీల్డులు గెలిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు.
Dichpally: డిచ్‌పల్లిలో ఎస్‌జీఎఫ్ క్రీడలు: రాంపూర్ విద్యార్థుల సత్తా
నిజామాబాద్ జిల్లా: డిచ్ పల్లి లో నిర్వహించిన 70వ ఎస్.జి.ఎఫ్. మండల స్థాయి క్రీడల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంపూర్ విద్యార్థులు - విద్యార్థినులు సత్తా చాటారు.అండర్-14 విభాగంలో బాలికలు మరియు బాలురు ఖో-ఖో, కబడ్డీలలో ప్రథమ - ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మరియు అండర్-17 విభాగంలో బాలుర, బాలికల కబడ్డీ - ఖో-ఖో లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.మొత్తం 7 షీల్డ్‌లు రావడంతో ఓవరాల్‌గా ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది.
విద్యార్థులను రాంపూర్ PD రామ్, పాఠశాల కన్వీనర్ శ్రీమతి గంగా సావిత్రి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ కాయితి రమ్య పవన్, సీనియర్ కబడ్డీ ప్లేయర్ కాయతి రాజ్ కుమార్, గ్రామ యువకులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.




