Dichpally: డిచ్‌పల్లిలో ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు!

Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ముగిసిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన సర్పంచ్ యాదగిరి.

M. RAMESH,NIZAMABAD
Published on: 1 Nov 2026 7:58 AM IST
Dichpally
X

Dichpally: డిచ్‌పల్లిలో ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు!

Dichpally: డిచ్‌పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా డిచ్ పల్లి (ZPHS)లో గురువారం నుంచి శనివారం వరకు 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మండల పరిధిలోని 26 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాలు సాధించిన విజేత జట్లకు గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ (జీపీ), విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ యాద గిరి మాట్లాడుతు.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోక్కిడి యాద గిరి , ఉప సర్పంచ్ దోర్నాల సౌజన్య అనిల్,మండల విద్యాశాఖ అధికారి నరేష్, ప్రధానోపాధ్యాయులు సీతయ్య, పాఠశాల PD స్వప్న, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అసది రవీందర్,కిషన్,రామాలయ కమిటి చైర్మన్ ఏ జీ దాస్,యువజన సంఘాలు, మండలంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు PD లు, PET, తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD