Mohammadabad: 40% సబ్సిడీపై శనగ విత్తనాలు: ఏఈవో సతీష్

Mohammadabad: కామారెడ్డి జిల్లా మొహమ్మదాబాద్ రైతులకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు అందిస్తోందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సతీష్ తెలిపారు.

VEERANNA, JUKKAL
Published on: 22 Oct 2026 3:51 PM IST
Mohammadabad
X

Mohammadabad: 40% సబ్సిడీపై శనగ విత్తనాలు: ఏఈవో సతీష్

మొహమ్మద బాద్ (కామారెడ్డి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ద్వార 40%శాతం సబ్సిడీ పై అందిస్తున్న శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నగల్ గావ్ క్లస్టర్ లొని మొహమ్మద బాద్ గ్రామ రైతులకు వ్యవసాయ అధికారి ఛిద్రవర్ సతీష్ తెలిపారు. విత్తన బ్యాగులు కావాల్సిన ప్రతి రైతు తమ పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో కూడిన పత్రాలతో ఏ ఇ ఓ ను సంప్రదించాలని రైతులకు సూచించారు.

ప్రభుత్వం ద్వార అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సబ్సిడీ పై ఇచ్చే విత్తనాలలో మొహమ్మదబాద్ గ్రామానికి గాను ఎన్ బి ఈ జి - 452 (NBeG -452),(NBeG-47)రకాలకు చెందిన విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఏ ఈ ఓ పేర్కొన్నారు.

ఒక్కో 25 కిలోల బరువు కలిగి ఉండగా, రెండు రకాలు కలిపి మొత్తం 35 బ్యాగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఒక్కొక్క బ్యాగు ధర వచ్చి 1500,పదహేను వందలుగా నిర్ణయించినట్లు అయన తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు నేరుగా పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తో మండల వ్యవసాయ కార్యాలయానికి తీసుకోచ్చి రషీద్ తీసుకొని వెళ్లి బ్యాగులు తీసుకెళ్లాలని ఒక పాస్ బూక్ పై కేవలం ఒక బ్యాగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL