Nizamabad: నిజామాబాద్‌లో గణేష్ శోభయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు!

Nizamabad: నిజామాబాద్‌లో గణేష్ శోభయాత్రకు 1300 మంది పోలీసులతో పటిష్ట భద్రత. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య వెల్లడి.

M. RAMESH,NIZAMABAD
Published on: 22 Sept 2026 10:39 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్‌లో గణేష్ శోభయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు!

Nizamabad: వినాయక శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు..శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ..డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, 200 సి.సి కెమెరాలతో ఏర్పాట్లు చేసినట్లు సీ.పీ సాయి చైతన్య తెలిపారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,తెలిపారు.గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శోభయాత్రలో తప్పనిసరి పాటించవలసిన సూచనలు.

1) నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని కోరారు

2) అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని తెలిపారు.

3) ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని సూచించారు.

4) ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని తెలిపారు.

5) డి.జేలు పూర్తిగా నిషేదం అని తెలిపారు.

6) ఎటువంటి " రూమర్స్ " ( పుకార్ల) ను నమ్మరాదు అని తెలిపారు.

7) మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకోబడునుని తెలిపారు.

అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 112 డయల్..పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 8712659700...సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించలని సీపీ సాయి చైతన్య తెలిపారు.ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD