Nizamabad: నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని శివారులో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 4 Oct 2026 6:57 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఈ రోజు ఉదయం పోతంగల్ మండలం సుంకిని శివారులోని మంజీరా నది నుండి అనుమతి లేకుండా,అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను 03 నింపినవి,08 ట్రాక్టర్లు నింపడానికి సిద్ధంగా ఉంచినవి,మొత్తం 11 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని వారు తెలిపారు.పట్టుకున్న వాహనాలను కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించామని అన్నారు.అనుమతి లేకుండా ఎవరైనా ఇసుకను తరలిస్తే వారి పై కేసులు నమోదు చేస్తామని,వారి పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA