Nellore: పేర్నాటి కోటేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Nellore: మంత్రి నారాయణ అవినీతిపై చంద్రశేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రూప్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పలేక డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని కోటేశ్వర రెడ్డి విమర్శించారు.
Nellore: పేర్నాటి కోటేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Nellore: నెల్లూరు నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. మాట్లాడితే దానికి సమాధానం చెప్పే.. పరిస్థితి కూటమి పార్టీల్లో లేదు. మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైనా..ఆరోపణలు చేసే ముందు అందులో వాస్తవాలు ఉంటేనే దాని గురించి మాట్లాడతారు.MLC చంద్రశేఖర్ రెడ్డి గారు సంస్కారవంతులు కాబట్టి.. ఎవరిపై వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా కేవలం మంత్రి నారాయణ చేసిన అవినీతి గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది.
ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు.. రూప్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పలేక.. డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు.మాట్లాడితే చంద్రశేఖర్ రెడ్డి గారిని రాజకీయాలకి కొత్త నీకేం తెలుసు.. అని మాట్లాడుతున్న రూప్ కుమార్ యాదవ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు గెలవలేని.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ టీచర్స్ ఎమ్మెల్సీ గా.. భారీ మెజారిటీతో చంద్రశేఖర్ రెడ్డి గారు గెలుపొంది.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాం అనేది ముఖ్యం కాదు.. ఎంత నీతిగా నిజాయితీగా, రాజకీయాలు చేస్తూ ప్రజా సేవకు అంకితం అవుతున్నామన్నదే.. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.
ఇంకోసారి మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిపై.. అర్థం పర్థం లేని.. వ్యాఖ్యలు చేస్తే.. సహించేది లేదని. రూప్ కుమార్ యాదవ్ ను హెచ్చరించారు.పేదలపై బారం వేసి వసూలు చేసే పన్నుల సొమ్మును ఇలా దోపిడీ చేయడం సరికాదని మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక రూప్ కుమార్ యాదవ్ అధికార పార్టీ మెప్పు పొందేందుకు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.అబద్ధాలు అవినీతి అసత్యాలు, తెలియని నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.10 మందికి సహాయపడుతూ సమాజంలో వారు ఎంతో గౌరవంగా బ్రతకాలని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు.
రూప్ కుమార్ యాదవ్ నీలాగా అసత్యాలు, అబద్ధాలు, అవినీతి పనులు.. చేయడం మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియదు.మంత్రి నారాయణ వీఆర్ హై స్కూల్ పేరుతో 5 కోట్ల రూపాయల దోపిడికి స్కెచ్ వేసింది వాస్తవం కాదా.. చెప్పాలన్నారు.దీనిపై ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియజేస్తే.. మీరు వెనక్కి తగ్గిన మాట వాస్తవం కాదా సమాధానం చెప్పండి.
వి ఆర్ హై స్కూల్ అవినీతి గురించి ప్రశ్నిస్తే కొంచెంసేపు CSR ఫండ్స్ అని, కాసేపు సొంత నిధులని మా ఫ్రెండ్స్ ఇచ్చారని మంత్రి నారాయణ బుకాయించుకోవడం నిజం కాదా చెప్పాలన్నారు. అలాగే చెట్ల విషయంలో కూడా.. పెద్ద ఎత్తున దోపిడీకి.. మీరు ప్రయత్నించలేదా.. సమాధానం చెప్పాలన్నారు.
ఒక్కొక్క చెట్టుకు 12 వేల రూపాయలు చొప్పున ఖర్చు చేయాలని .. భారీ దోపిడీకి.. అంచనాలు రూపొందించుకొని ఖర్చు చేయడానికి సిద్ధమైతే.. మేము ప్రశ్నించేసరికి.. లేదని బుకాయించుకున్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాలన్నారు.
ఈరోజు రాష్ట్రంలో చెత్త పేరుతో జరుగుతున్న 1200 కోట్ల భారీ దోపిడి గురించి.. అన్ని ఆధారాలు బయటపెట్టి మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. ప్రజల ముందు చర్చకు రావాలని అడిగితే కనీసం దానిపై సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో మంత్రి నారాయణ వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.నెల్లూరు కార్పొరేషన్ లో చెత్త ట్రాక్టర్ల పేరుతో జరుగుతున్న దోపిడి గురించి మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణి లో మాట్లాడావు.
అదే విధంగా స్వీపింగ్ మిషన్లను మెయిన్ రోడ్లకు పరిమితం చేసి మిగిలిన రోడ్డులో పారిశుధ్య కార్మికుల ద్వారా పనులు చేయిస్తే కొన్ని వందల కార్మికుల కుటుంబాలకు అది జీవనాధారం అవుతుందని మా నాయకులు చెబితే దాన్ని వక్రీకరించి కార్మికులకి క్షమాపణలు చెప్పాలని అడగడం నీ నీచ సంస్కృతికి నిదర్శనం.
నెల్లూరు నగరంలో రంగుల పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక ఏవేవో అవాకులు చావాకులు పేలుతున్నావ్.ఇక మెగా డీఎస్సీ లో అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వాస్తవాలతో సహా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నిరూపించారు.క్రీడాకోటాలో ఇచ్చిన 382 టీచర్ ఉద్యోగాల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఒక్కో టీచర్ ఉద్యోగాన్ని లక్షల రూపాయలకు కూటమి నేతలు అమ్ముకున్న మాట వాస్తవం కాదా.దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని.. వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుంటే కూటమినేతలు పత్తా లేకుండా పారిపోయారని అన్నారు.
తిరుమల లడ్డు విషయంలో ఎలాంటి కల్తీ జరగలేదని మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసనమండలిలో వాస్తవాలతో సహ నిరూపిస్తే కూటమినేతలు సమాధానం చెప్పలేక పారిపోయారని అన్నారు.ఈరోజు రూప్ కుమార్ యాదవ్ కేవలం మేయర్ సీటు కోసం ఆరాటపడుతూ అర్థంపర్థం లేని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు.ఇలాంటి చౌకబారు ప్రెస్ మీట్ లు నిర్వహించడం.. వ్యర్ధమని ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి.




