Rapur: జోరేపల్లి, అక్కమాంబపురంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అనూష భారీ ర్యాలీ!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మండలం జోరేపల్లి, అక్కమాంబపురంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి తలుపూరు అనూష 750 మందితో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

Yellayya, Nellore
Published on: 22 Nov 2026 7:49 PM IST
Rapur
X

Rapur: జోరేపల్లి, అక్కమాంబపురంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అనూష భారీ ర్యాలీ!

నెల్లూరు జిల్లా: రాపూరు మండలంలోని జోరేపల్లి, అక్కమాంబపురం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తలుపూరు అనూషకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఏఎంసీ డైరెక్టర్ తలుపూరు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 750 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీగా తరలివచ్చారు. గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం మధ్య ర్యాలీ కొనసాగింది.

అనంతరం గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామ సచివాలయానికి చేరుకుని సర్పంచ్ అభ్యర్థిగా తలుపూరు అనూష నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు...ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore