Nellore: దొరువులపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దువ్వూరు నిరంజన్ రెడ్డి నామినేషన్!
Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు దువ్వూరు నిరంజన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Nellore: దొరువులపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దువ్వూరు నిరంజన్ రెడ్డి నామినేషన్!
Nellore: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం దొరువులపాళెం గ్రామ పంచాయతీ వైసిపి బలపరిచిన అభ్యర్థిగా దువ్వూరు నిరంజన్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది.
దొరువులపాలెం పంచాయతీ సంబంధించి దువ్వూరు విశ్వ మోహన్ రెడ్డి గతంలో నీటిపారుదల శాఖ సంఘం అధ్యక్షుడిగా, సర్వేపల్లి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ గా, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడుగా పలుమార్లు సేవలు అందించి ఉన్నారు.
అలాగే దువ్వూరు నిరంజన్ రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా దొరువుల పాలెం రైతులకు పలు సేవలు అందించి ఉన్నారు. కావున తాను తన కుటుంబం గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తించి తమకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించవలెనని గ్రామస్తులను కోరారు.
ఈ కార్యక్రమంలో దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి, దువ్వూరు తేజ రెడ్డి, విజయమ్మ, హరినాథ్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.




