Nellore: చేపల మాఫియాపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు యానాదుల వినతి!
Nellore: అల్లూరు, సింగపేట చెరువుల్లో గిరిజనుల పొట్ట కొడుతున్న చేపల మాఫియాపై చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
Nellore: చేపల మాఫియాపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు యానాదుల వినతి!
Nellore: రూ.10 కోట్ల విలువైన మత్స్య సంపదను దోచుకుంటున్న చేపల మాఫియాపై చర్యలు తీసుకోవాలని, అల్లూరు, సింగపేట గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కి గ్రీవెన్స్ లో యానాదుల సంక్షేమ సంఘం వినతి పత్రం సమర్పించారు. నెల్లూరు జిల్లా అల్లూరు చెరువు, సింగపేట చెరువు సొసైటీ పరిధిలో గిరిజన మత్స్యకారుల పొట్ట కొడుతున్న చేపల మాఫియాపై చర్యలను తీసుకోవాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ని కోరారు.
ఈ సందర్బంగా గిరిజన నాయకులు కేసి పెంచలయ్య మాట్లాడుతూ అల్లూరు, సింగపేట సొసైటీ పరిధిలో సభ్యులైన గిరిజనులను చేపల పట్టుకొనివ్వకుండా చేపల మాఫియా అడ్డుకొంటుందన్నారు.
ఆయా చెరువులలో చేపలు పట్టుకొని హక్కు గిరిజన మత్స్యకారులైన సభ్యులకు మాత్రమే ఉందని, కానీ సభ్యులను బెదిరించి సభ్యులను చెరువులో దిగనివ్వకుండా మత్స్య సంపదను చేపల మాఫియా సొమ్ము చేసుకొంటుందని, గిరిజనులకు చెందాల్సిన 10 కోట్ల మత్స్యకార సంపదను మాఫియా దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తునదని భావించామని, కూటమి ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ విషయంపై విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలని, లేకుంటే పోరాటం తప్పదని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తీరివీధి సతీష్ చంద్ర, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మానికల మురళి,మహిళా అధ్యక్షురాలు చెంబేటీ ఉష, చల్లంచర్ల తిరుపతమ్మ,అల్లూరు మండలం నాయకులు దాసరి అబ్బయ్య పాల్గొన్నారు.




