Nellore: నెల్లూరులో కిమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు!
Nellore: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. గుండె ఆరోగ్యంపై ప్రజలకు డాక్టర్ల సూచనలు. పూర్తి వివరాలు.
Nellore: నెల్లూరులో కిమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు!
Nellore: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ హాస్పిటల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యులు, సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నిత్య వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచించారు.
ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు అంబులెన్స్‌లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పలువురు వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.




