Manubolu: మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కందుకూరు మహిళ అక్కడికక్కడే మృతి!
Manubolu: నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
Manubolu: మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కందుకూరు మహిళ అక్కడికక్కడే మృతి!
Manubolu: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి నెల్లూరు వెళ్లే మార్గంలో మనుబోలు పోలీస్‌స్టేషన్ దాటిన తర్వాత పామాయిల్ పాత కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. చెన్నై నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు నడుపుతున్నది మృతురాలి అల్లుడిగా తెలిసింది. కారు లారీని బలంగా ఢీకొనడంతో అత్త కూర్చున్న వైపు తీవ్రంగా దెబ్బతిని ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలిని ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన ఖంభం జయలక్ష్మి (50), భర్త రామయ్యగా గుర్తించారు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న హైవే మొబైల్ ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐ నాగేశ్వరరావు, మురళి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.




