Nellore: వరికుంటపాడు పిఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం!
Nellore: వరికుంటపాడు పిఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం. స్వీపర్ పోస్టు వివాదంలో భర్త అరెస్ట్ కావడంతో మనస్తాపంతో విషం తాగింది. పూర్తి వివరాలు ఇవే.
Nellore: వరికుంటపాడు పిఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం!
Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. భర్త అరెస్టుతో మనస్తాపానికి గురైన భార్య వాసుమాల్ తాగి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది.వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ పోస్టు విషయంలో వివాదం తలెత్తింది. తన భార్యకు స్వీపర్ పోస్టు ఇప్పించాలని ఇట్లా రవి ప్రయత్నించగా, అదే పోస్టు కోసం మరో వ్యక్తికి స్థానిక నాయకుడు సిఫారసు చేయడంతో వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సదరు నాయకుడి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి గొడవ చేశాడంటూ ఇట్లా రవిపై నాయకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇట్లా రవిని అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.భర్త అరెస్టు విషయం తెలుసుకున్న భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త గురించి ఆరా తీసింది.
అయితే తనకు సరైన సమాధానం లభించలేదని మనస్తాపానికి గురైన ఆమె, వెంట తెచ్చుకున్న వాసుమాల్ తాగి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం పామూరు నుండి కందుకూరుకు తరలించాలని సూచించారు.
ఈ క్రమంలో ఉదయగిరి సీఐ జోక్యంతో పామూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. స్వీపర్ పోస్టు విషయంలో ప్రారంభమైన వివాదం చివరకు మహిళ ఆత్మహత్యాయత్నానికి దారితీయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




