Vinjamuru: వింజమూరు: స్థానిక ఎన్నికలపై మేకపాటి రాజగోపాల్‌రెడ్డి దిశానిర్దేశం

Vinjamuru: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి వైసీపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 22 Sept 2026 2:39 PM IST
Vinjamuru
X

Vinjamuru: వింజమూరు: స్థానిక ఎన్నికలపై మేకపాటి రాజగోపాల్‌రెడ్డి దిశానిర్దేశం

వింజమూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

వింజమూరు మండల కేంద్రంలోని వీఆర్‌ ఫంక్షన్‌ ప్లాజాలో మండల కన్వీనర్‌ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అలాగే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru