Nellore: కలువాయి విశ్వం హైస్కూల్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి విశ్వం హైస్కూల్‌లో వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు అటవీ సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Madhav Goud, Nellore
Published on: 5 Oct 2026 5:08 PM IST
Nellore
X

Nellore: కలువాయి విశ్వం హైస్కూల్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం లోని వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని విశ్వం హైస్కూల్‌లో విద్యార్థులకు అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, రాపూరు ఫారెస్ట్ రేంజర్ జ్యోతి ఆనంద్ విద్యార్థులతో కలిసి అటవీ సంపద, వన్యప్రాణుల ప్రాధాన్యత, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా విద్యార్థులకు అటవీ సంరక్షణ అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు, అనంతరం పాఠశాల నుంచి విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణపై నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కలువాయి డీఆర్ఓ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, స్వార్డ్ సిబ్బంది, కలువాయి ఫారెస్ట్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore