Somasila: భర్త ఇంటి ముందు నిరసన తెలిపిన వివాహితపై దాడి!

Somasila: నెల్లూరు జిల్లా సోమశిల గ్రామంలో భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన వివాహిత కరిష్మాపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఆరోపణలు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 7 Oct 2026 12:52 PM IST
Somasila
X

Somasila: భర్త ఇంటి ముందు నిరసన తెలిపిన వివాహితపై దాడి!

Somasila: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో వివాహిత కరిష్మాపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త తనకు కావాలంటూ కరిష్మా భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

ఈ క్రమంలో భర్త అబ్బాస్ తల్లి, తోడికోడళ్లు తనపై దాడి చేసినట్లు కరిష్మా ఆరోపించింది. కరిష్మా, ఆమె భర్త అబ్బాస్ మధ్య గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదాలు ఉన్నాయని స్థానికులు తెలుపుతున్నారు. అబ్బాస్ ప్రస్తుతం ఉదయగిరి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కరిష్మా భర్త ఇంటి వద్దకు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టింది.

ఈ క్రమంలోనే అబ్బాస్ తల్లి, తోడికోడళ్లు తనపై దాడి చేశారు. ఘటనపై ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)