Buchireddypalem: చెప్పాం.. చేస్తున్నాం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
Buchireddypalem: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కూటమిని గెలిపిస్తే రూపురేఖలు మారుస్తామని ప్రశాంతి రెడ్డి తెలిపారు.
Buchireddypalem: చెప్పాం.. చేస్తున్నాం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.22 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలు మరోసారి కూటమికి అవకాశం ఇస్తే బుచ్చిరెడ్డిపాళెం రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 5, 21, 23, 24 వార్డుల్లో గురువారం నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్థానిక ప్రజలను కలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 5వ వార్డు టీడీపీ అభ్యర్థి అందె పెంచల ప్రత్యూష, 21వ వార్డు అభ్యర్థి బండ్ల ధనలక్ష్మి, 23వ వార్డు అభ్యర్థి తాళ్ల వైష్ణవి, 24వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆలూరు నాగవేణిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.




