Nellore: మర్రిపాడు మండలంలో ముగిసిన విపీఆర్ నేత్ర కంటి పరీక్షలు!
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 31 రోజులుగా సాగిన విపీఆర్ నేత్ర పరీక్షలు ముగిశాయి. 8,528 మందికి పరీక్షలు చేసి 4,086 మందికి అద్దాలు అందజేశారు.
Nellore: మర్రిపాడు మండలంలో ముగిసిన విపీఆర్ నేత్ర కంటి పరీక్షలు!
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 31 రోజులుగా కొనసాగుతున్న విపీఆర్ నేత్ర కంటి పరీక్షలు నేటితో ముగిశాయి. మండలంలోని 24 పంచాయతీల్లో మొత్తం 8,528 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 4,086 మందికి కంటి అద్దాలు అందజేసినట్లు ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు తెలిపారు.
మండలంలో చివరి రోజైన నేడు మర్రిపాడులో విపీఆర్ నేత్ర కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరికట్ల జనార్ధన్ నాయుడు మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా 32,588 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 16,298 మందికి కంటి అద్దాలు అందించినట్లు తెలిపారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా 1,22,866 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 72,676 మందికి కంటి అద్దాలు అందించినట్లు వెల్లడించారు.పదవులు ఉన్నా లేకున్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు విపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరికట్ల జనార్ధన్ నాయుడు కొనియాడారు.
అలాగే, 31 రోజులపాటు మండలంలో కష్టపడి సేవలందించిన విపీఆర్ బృందానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాఖమూరి నారాయణ, విపీఆర్ కంటి నేత్ర చీప్ కోఆర్డినేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.




