Vinjamur: ఎంపీపీ పాలకవర్గం పదవీకాలం ముగింపు - ఎంపీటీసీలకు సన్మానం
Vinjamur: వింజమూరు మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం. పదవీకాలం ముగిసిన ఎంపీటీసీలను ఘనంగా సత్కరించిన ఎంపీపీ హైమావతి మరియు అధికారులు.
Vinjamur: ఎంపీపీ పాలకవర్గం పదవీకాలం ముగింపు - ఎంపీటీసీలకు సన్మానం
వింజమూరు: మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వింజమూరు మండల పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.ఎంపీపీ హైమావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు,ప్రజా సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ హైమావతి ఘనంగా సత్కరించారు.ఎంపీటీసీల సేవలను అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించి,జ్ఞాపికలను అందజేశారు.మండల అభివృద్ధికి ఎంపీటీసీ సభ్యులు అందించిన సహకారం అభినందనీయమని ఎంపీపీ హైమావతి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి ఎంపీటీసీలు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. పదవీకాలం ముగిసినా ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, మండల పరిషత్ సిబ్బంది, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




