Vinjamur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం విజేతలకు బొల్లినేని అభినందనలు!

Vinjamur: ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి అభ్యర్థులకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు అభినందనలు.

V. Kamaiah, Vinjamuru
Published on: 8 Nov 2026 9:52 AM IST
Vinjamur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం విజేతలకు బొల్లినేని అభినందనలు!
X

Vinjamur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం విజేతలకు బొల్లినేని అభినందనలు!

Vinjamur: ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు,ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అభినందనలు తెలిపారు.ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి చాటిచెప్పాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు అందించిన తీర్పును గౌరవిస్తూ,తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విజేతలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో తాగునీరు,రహదారులు, పారిశుద్ధ్యం,మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను గుర్తించి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణుల సేవలను ఆయన అభినందించారు.కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, విజయాన్ని అందించిన ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు కూటమి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేయాలని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru