Gudur: గూడూరులో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు!
Gudur: గూడూరు శ్రీ విజయ దుర్గ ఉప పీఠంలో దసరా నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
Gudur: గూడూరులో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గూడూరు పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయ దుర్గ ఉప పీఠంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారు *శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారంలో.భక్తులకు దర్శనమిచ్చారు. లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆలయ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహా నవావరణ హోమం, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం చేశారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల నాట్య ప్రదర్శనకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.




