Venkatagiri: వెంకటగిరిలో వైభవంగా పోలేరమ్మ జాతర
Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.
Venkatagiri: వెంకటగిరిలో వైభవంగా పోలేరమ్మ జాతర
వెంకటగిరి: వెంకటగిరిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించి, ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
వెంకటగిరికి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర పండుగగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వెంకటగిరి పట్టణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.




