Venkatagiri: భక్తిశ్రద్ధలతో వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర!

Venkatagiri: వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో భక్తుల భారీ సందడి. ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించిన శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి.

Yellayya, Nellore
Published on: 1 Oct 2026 9:54 AM IST
Venkatagiri
X

Venkatagiri: భక్తిశ్రద్ధలతో వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర!

Venkatagiri: వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు.పోలేరమ్మ అమ్మవారి నామస్మరణతో వెంకటగిరి పట్టణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది.

Yellayya, Nellore

Yellayya, Nellore