Gudur: గూడూరు రూరల్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం వెంకటేష్ పల్లి గ్రామ శివార్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గాయాలతో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Oct 2026 9:43 AM IST
Gudur
X

Gudur: గూడూరు రూరల్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మసముద్రం సమీపంలోని వెంకటేష్ పల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండటాన్ని స్థానిక రైతులు గమనించారు. వెంటనే గూడూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడి శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో ఇది హత్య అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న గూడూరు రూరల్ ఎస్ఐ తిరుపతయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, మిస్సింగ్ కేసుల ఆధారంగా ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతయ్య వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలియజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్