Udayagiri: ఉదయగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలో భారీ చేరికలు!
Udayagiri: ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరారు.
Udayagiri: ఉదయగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలో భారీ చేరికలు!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉదయగిరి మండలం జి. కొత్తపల్లిలో మాజీ సొసైటీ అధ్యక్షుడు మూలే వినయ్ రెడ్డి, మాజీ ఎంపీపీ మూలే పద్మజ, మాజీ వైకాపా మండల కన్వీనర్ మూలే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో మాజీ బిట్-1 ఎంపీటీసీ గొల్లపల్లి తిరుపతితో పాటు పలువురు మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానికంగా కీలక నేతలు పార్టీ మారడం ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మరింత మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.




