Nellore: ఉదయగిరిలో ఎన్నికల వేడి: కేంద్రాల వద్ద బందోబస్తు!

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ అంకమ్మరావు తెలిపారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 21 Oct 2026 1:57 PM IST
Nellore
X

Nellore: ఉదయగిరిలో ఎన్నికల వేడి: కేంద్రాల వద్ద బందోబస్తు!

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకమ్మరావు తెలిపారు. ఎంపీపీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను మోహరించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకమ్మరావు సూచించారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI