Udayagiri: అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ!

Udayagiri: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఐ అంకమ్మరావు, ఎస్సై సుభాషిని ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 25 Oct 2026 10:00 PM IST
Udayagiri
X

Udayagiri: అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ!

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకమ్మరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ సుభాషిని, పోలీస్ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టి అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI