Udayagiri: పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది పవన్ కళ్యాణ్
Udayagiri: ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్లతో పల్లె పండుగ-3.0ను సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఉదయగిరికి పలు అభివృద్ధి హామీలు.
Udayagiri: పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది పవన్ కళ్యాణ్
ఉదయగిరి: పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్లతో చేపట్టిన పల్లె పండుగ–3.0 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించారు.
గత ఐదేళ్లలో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే దాదాపు 9 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామని చెప్పారు.ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ ద్వారా రూ.121 కోట్లతో 115 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లు, 1,200కు పైగా నీటి కుంటలు, 348 మినీ గోకులాలు, 190కి పైగా నీటి తొట్లు, సుమారు 900 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.52 కోట్లతో సుజల శ్రవంతి పథకం కింద ఎనిమిది మండలాల్లో 381 పనులు చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.అలాగే ఉదయగిరి కోటకు చేరుకునే మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల రహదారిని రూ.2.5 కోట్లతో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉదయగిరి కోటను పర్యాటక ప్రాంతంగా, ఉదయగిరి కొండను హెరిటేజ్, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.గజ్జలవారిపల్లి పాఠశాల విద్యార్థులు రహదారి కోసం సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తిపై స్పందించి రహదారి పనులను పూర్తి చేసినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, పనుల నాణ్యతను పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.




