Udayagiri: కాకొల్లువారిపల్లెలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Udayagiri: ఉదయగిరి మండలం కాకొల్లువారిపల్లెలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటించారు.
Udayagiri: కాకొల్లువారిపల్లెలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
ఉదయగిరి: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కాకొల్లువారిపల్లె గ్రామంలో పర్యటించారు.గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు గ్రామస్థులు పూలు జల్లి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ గ్రామంలో నడిచిన సీఎం, డిప్యూటీ సీఎం పల్లె పండుగ 3.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనతో కాకొల్లువారిపల్లెలో సందడి నెలకొంది.




