Udayagiri: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Udayagiri: ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 29 Sept 2026 11:11 PM IST
Udayagiri
X

Udayagiri: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి రూ.11,085 కోట్లతో చేపట్టనున్న గ్రామీణ అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతులు, తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పనులు చేపడుతున్న నేపథ్యంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి రామాపురం వేదికగా నిలిచింది.

బహిరంగ సభ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి పీవీఎన్ మాధవ్ కాకొల్లువారిపల్లె గ్రామంలో పల్లె పండుగ అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్థులతో మమేకమై అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం గ్రామస్థులతో కలిసి గ్రూప్ ఫొటోలో పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI