Udayagiri: ఉదయగిరి వ్యవసాయ విద్యార్థుల 10 రోజుల విద్యా విహారయాత్ర

Udayagiri: ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల 3వ సంవత్సరం విద్యార్థుల దక్షిణ భారత యాత్ర ప్రారంభం; తమిళనాడు, కేరళలో 10 రోజుల పర్యటన.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 24 Nov 2026 9:53 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరి వ్యవసాయ విద్యార్థుల 10 రోజుల విద్యా విహారయాత్ర

ఉదయగిరి: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ఆనర్స్ వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న మూడవ సంవత్సరం విద్యార్థులు 75 మంది ఈ విద్యా విహారయాత్రలో పాల్గొంటున్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పది రోజుల పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ సంబంధిత సంస్థలను సందర్శించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం, కోయంబత్తూరులో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, చెరకు పరిశోధనా కేంద్రంతో పాటు కేరళలోని కొచ్చి, అలప్పుజ, మున్నార్ ప్రాంతాల్లోని వివిధ వ్యవసాయ సంబంధిత సంస్థలను సందర్శిస్తారు.

అలాగే త్రిస్సూర్‌లోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఊటీలోని భారతీయ నేల పరిరక్షణ సంస్థను సందర్శించి అక్కడి వ్యవసాయ పరిశోధనలు, విద్యా విధానాలు, విస్తరణ కార్యక్రమాలపై అవగాహన పొందనున్నారు.వివిధ సంస్థల్లోని పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యా బోధనకు సంబంధించిన సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవడం ఈ విద్యా విహారయాత్ర ముఖ్య ఉద్దేశమని కళాశాల వర్గాలు తెలిపాయి.ఈ యాత్రకు మృత్తిక మరియు వ్యవసాయ రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. సంధ్య, సహాయక ఆచార్యులు డాక్టర్ పి. రామసుబ్బయ్య నాయకత్వం వహిస్తుండగా, పరిపాలన కార్యాలయ సహాయకులు వై. మోహన్ విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తోడుగా వెళ్తున్నారు.

ఈ పర్యటనలో 51 మంది బాలికలు, 24 మంది బాలురు కలిపి మొత్తం 75 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పరిశోధనలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ విద్యా విహారయాత్ర ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI