Nellore: నెల్లూరు జిల్లా ఆలయంలో శివలింగం ముందు ప్రత్యక్షమైన మూడు నాగులు!
Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చి శివలింగం ముందు పడగవిప్పి దర్శించుకున్నాయి.
Nellore: నెల్లూరు జిల్లా ఆలయంలో శివలింగం ముందు ప్రత్యక్షమైన మూడు నాగులు!
Nellore: నెల్లూరు జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగలు విప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు విశ్వనాథ స్వామి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ అద్భుతం జరిగింది.
పూజారి యధావిధిగా ఆలయ తలుపులు తెరిచేసరికి గర్భగుడిలో శివలింగం ముందు మూడు పెద్ద నాగుపాములు పడగలు విప్పి దర్శనం చేసుకుంటున్నట్టు కనిపించాయి.దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ నాగులు శివలింగం వైపే చూస్తూ అక్కడే ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్లిపోయాయని పూజారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా మనుబోలు, చెర్లోపల్లి, గూడూరు ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.సాక్షాత్తు నాగేంద్రుడే పరమశివుని దర్శనానికి వచ్చాడని, ఇది ఆ ఊరికి ఎంతో శుభసూచకమని భక్తులు భావిస్తున్నారు. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ఇలా నాగులు రావడం శుభమని పూజారులు చెబుతున్నారు.
అయితే ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు ముందు జాగ్రత్తగా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈరోజు వచ్చిన మూడు నాగుల దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయని, ఆ వీడియోను అందజేశారు.ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు విశ్వనాథ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.




