Nellore: నెల్లూరు జిల్లాలో తెలంగాణ ఐఏఎస్ అధికారి కారుకు ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లి సమీపంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతు కారు స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.
Nellore: నెల్లూరు జిల్లాలో తెలంగాణ ఐఏఎస్ అధికారి కారుకు ప్రమాదం!
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో నెంబర్ 565 జాతీయ రహదారిపై తెలంగాణ ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతు కారు ప్రమాదానికి గురైంది.అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లి సమీపంలో ఆయన కారు స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజీవ్ హనుమంతుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఆయన పిల్లలు సరయు, ప్రేరణదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి.
ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు.గాయపడ్డ ఐఏఎస్ అధికారిని, కుటుంబ సభ్యులను హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్ హనుమంతును ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు.
గాయపడ్డ రాజీవ్ హనుమంతు తెలంగాణలో రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీగా పనిచేస్తున్నారు. దక్షిణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై ఆత్మకూరు పోలీసులు విచారణ చేపట్టారు.




