Nellore: నెల్లూరులో వెయ్యి మందికి అన్నదానం అందజేసిన టీడీపీ నాయకులు!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జీజీహెచ్‌లో వేయి మందికి టీడీపీ నేతలు అన్నదానం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Sept 2026 1:26 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వెయ్యి మందికి అన్నదానం అందజేసిన టీడీపీ నాయకులు!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు దారా మల్లికార్జున, మొగరాల సురేష్, అబిదా సుల్తానా, బ్రహ్మారెడ్డి, తదితరులతో పాటు టిడిపి సీనియర్ నాయకులు బర్నా బస్, పెంచలనాయుడు, హజరత్ నాయుడు, వల్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గూటూరు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ... తమకు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE