Nellore: నెల్లూరు రాంజీ నగర్‌లో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్ రాంజీ నగర్‌లో జనసేన-కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nellore: నెల్లూరు రాంజీ నగర్‌లో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 21వ (పాత 16వ) డివిజన్‌లోని రాంజీ నగర్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న జనసేన–కూటమి ప్రచారం ఈరోజు కూడా యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
నెల్లూరు నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో నగర సుందరీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోంది. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ నెల్లూరు నగరాన్ని మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, ఆధునికీకరణకు శ్రీ పొంగూరు నారాయణ గారు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రాభివృద్ధికి మరింత తోడ్పాటునందిస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల విజ్ఞప్తి చేశారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువత, విద్యావంతులు సహా పలువురు ప్రజలను కలుసుకోగా, కూటమి అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూల స్పందన లభించిందని నాయకులు తెలిపారు. నగర అభివృద్ధి కొనసాగేందుకు కూటమికి మద్దతు తెలుపుతామని పలువురు పేర్కొన్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కిషోర్ గునుకుల, జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, సుప్రియ, కల్పన, కృష్ణవేణి, మడపర్తి ప్రశాంత్ గౌడ్, మల్లిరెడ్డి, నరహరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




