Nellore: నెల్లూరు టీడీపీ ఆత్మీయ భేటీ: రూప్ కుమార్, గిరిధర్ రెడ్డి

Nellore: నెల్లూరు 28వ డివిజన్ టీడీపీ ఆత్మీయ భేటీలో మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Oct 2026 6:06 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు టీడీపీ ఆత్మీయ భేటీ: రూప్ కుమార్, గిరిధర్ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు 28వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నన్నం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలసి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి... నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని, అలాగే 28వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నన్నం శ్రీనివాసులుని అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారం, ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర కీలక అంశాలపై సూచనలు చేశారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE