Nellore: నామినేషన్ కేంద్రంలో బైఠాయించిన టీడీపీ కార్పొరేటర్!
Nellore: 27వ డివిజన్ నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద ఉద్రిక్తత. అఫిడవిట్లో ఆస్తుల తప్పులంటూ టీడీపీ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆందోళన.
Nellore: నామినేషన్ కేంద్రంలో బైఠాయించిన టీడీపీ కార్పొరేటర్!
Nellore: నెల్లూరు ప్రశాంతంగా కొనసాగుతున్న నెల్లూరులోని నగరపాలక సంస్థ నామినేషన్ల పర్వంలో వివాదం మొదలైంది. నామినేషన్ల పరిశీలన సందర్భంగా 27 వ డివిజన్ ఎన్నికల కేంద్రం వద్ద గందరగోళం ఏర్పడింది.. వైసీపీకి చెందిన బిరదవోలు సందీప్ రెడ్డి అనే అభ్యర్థి అఫిడవిట్లో ఆస్తులు తప్పుగా చూపించారంటూ అధికార టిడిపికి చెందిన స్థానిక కార్పొరేటర్, 27వ డివిజన్ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ పత్రాల స్క్రూట్ ని కేంద్రంలో ఆయన ఆందోళనకు దిగారు. ఆఫీస్ లోనే బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సందీప్ రెడ్డి నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఆస్తులు అఫిడవిట్ లో తప్పిదాలను ఎన్నికల అధికారి ఆనంద్ బాబు పట్టించుకోవడం లేదంటూ.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసి అఫిడవిట్ పరిశీలించాలని ఆయన కోరారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ నేరుగా నామినేషన్ కేంద్రంలో ఆందోళనకు దిగడం చర్చ నీయాంశమైంది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పిదాలను గుర్తించని అధికారి ఆనందబాబు పై వ్యక్తిగతంగా కూడా పోరాటం చేస్తానంటూ టిడిపి కార్పొరేటర్ 27 వ డివిజన్ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి హెచ్చరికలు చేశారు.




