Nellore: దొంతాలి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి చదమాల స్వప్న ఘన విజయం!

Nellore: నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ స్థానాన్ని సొంతం చేసుకున్న టీడీపీ అభ్యర్థి చదమాల స్వప్న. 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన అనంతరం ప్రజలకు కృతజ్ఞతలు.

A Praveen, Nellore
Published on: 7 Nov 2026 12:32 PM IST
Nellore
X

Nellore: దొంతాలి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి చదమాల స్వప్న ఘన విజయం!

Nellore: నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదమాల స్వప్న 86 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన దొంతాలి గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చదమాల స్వప్న స్పష్టం చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore